calender_icon.png 17 December, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

10-12-2025 12:00:00 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, డిసెంబరు 9 (విజయ క్రాంతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో పెట్టుబడులకు హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ స్వర్గదామంగా ఆవిష్కృతం కానుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు మంగళవారం సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైసింగ్ స్లోగన్ కు ప్రపంచ దేశాలు ఫిదా అయ్యాయని తెలిపారు.

టాప్ మోస్ట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్తో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు వరలడ్స్ లార్జెస్ట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆలోచన విధానాలతో గ్లోబల్ సమ్మిట్ అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు.

కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వాతావరణం అనుకూలంగా ఉంటుందని, అనుమతుల వేగవంతానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని తెలిపారు. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని నరేందర్ రెడ్డితెలిపారు.