calender_icon.png 17 December, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఏకైక సంఘం ఏఐఎస్‌ఎఫ్

10-12-2025 12:00:00 AM

రెండేళ్ల పాలనలో విద్యార్థుల హామీల అమలు ఒక్కటేది?

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 09(విజయ క్రాంతి): భారతదేశానికి స్వాతంత్య్రం కావాలని ఏర్పడి విద్యార్థులను చైతన్యం చేసి పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్ అని, దేశంలో 90 సంవత్సరాలుగా వి ద్యార్థుల సమస్యల కోసం పోరాటాలు నిర్వహిస్తున్న చరిత్ర ఏఐఎస్‌ఎఫ్ కు ఉందని. మోడీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆ డుతుందని, రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అ మలు చేయలేదని, అందాల పోటీలకు ఉన్న నిధులు ,మెస్సీ తో ఫుట్ బాల్ ఆటపై ఉన్న శ్రద్ధ ,వాటికి ఉన్న నిధులు విద్యార్థులకు ఎం దుకు లేవని,రేవంత్ రెడ్డి మెస్సీ తో ఫుట్ బా ల్ ఆట కాదు విద్యార్థుల హాస్టళ్లను సందర్శించీ నిధులు కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏఐఎస్‌ఎఫ్ రా జన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభ సందర్భంగా పట్టణంలో బస్టాండ్ చౌరస్తా నుండి వ స్త్ర వ్యాపార సంఘం భవన్ వరకు విద్యార్థి ప్రదర్శన ర్యాలీ నిర్వహించి అనంతరం ఏఐఎస్‌ఎఫ్ జెండాను జిల్లా అ ధ్యక్షుడు రాకేష్ ఆవిష్కరించారు సంఘం భ వనంలో జిల్లా మహాసభ కుర్ర రాకేష్ అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు రాష్ట్ర అధ్య క్షుడు మణికంఠ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ. దేశంలో మోడీ ప్రభుత్వం11ఏళ్ల పాలనలో విద్యార్థులను విస్మరించిందని దేశంలో విద్య ప్రవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణ చేయడానికి కుట్ర చేస్తుందని నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారని, పాఠ్యాంశాల్లో మతపరపైన అంశాలను చేస్తూ చరిత్రను తొలగించే ప్రయత్నం చేయడాన్నీ విద్యార్థులు తిప్పి కొట్టాలని, కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ విభజన హామీల ప్రకా రం తెలంగాణకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కి రావలసిన కేటాయింపులను తీసుకురావడంలో విఫలం చెందారని,

రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి రెం డేళ్ల పాలన ప్రజా విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తూన్నారని, రెండేళ్ల పాలనలో విద్యార్థులకు ఇచ్చిన ఒక హామీ కూడా ఎందుకు అమలు చేయలేదని, విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థి ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్, ఐదు లక్షల విద్య భరోసా కార్డు, మం డలానికి ఇంటర్నేషనల్ పాఠశాల, యూనివర్సిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ లు, నిరు ద్యోగులకు నిరుద్యోగ భృతి, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏకకాలంలో విడుదల చేస్తామన్న హామీలు ఎందు కు అమలు చేయలేదని,

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న గురుకులాలు సంక్షేమా హాస్టళ్లు సమస్యలకు నిల యంగా మారి విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్న ప్రభుత్వంలో చలనం లేదని, రేవంత్ రెడ్డికి అందాల పోటీలకు , మెస్సితో ఫుట్ బాల్ ఆటకు నిధులు, ఆటపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై విద్యార్థి చదువులకు నిధుల కేటాయింపు పై లేదని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి విద్య శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని,ప్రభుత్వం వెంటనే ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు.

ఈ మహాసభలో మాజీ విద్యార్థి నాయకుడు జిల్లా ఏఐఎస్‌ఎఫ్ నిర్మాణ బాధ్యుడు మంద సుదర్శన్ ,ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కడారీ రాములు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర గరల్స్ కో కన్వీనర్ కండె విజేత,ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి కుర్ర రాకేష్,మంద అనిల్, జిల్లా ఆఫీస్ బేరర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.