calender_icon.png 26 August, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ఓటమితో తెలంగాణకు నష్టం

25-07-2024 12:05:00 AM

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్, జూలై 24: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణకు బడ్జెట్ కేటాయించనం దుకు రాష్ట్ర ఎంపీలు నిలదీయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం నుంచి చోటే భాయ్ రేవంత్‌రెడ్డి హైకమాండ్‌కు తరలిస్తుంటే, బడే భాయ్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌కు నిధులను వరదలా పారిస్తున్నారని ఆరోపించారు.

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందన్నారు. మూసీ అభివృద్ధికి మొన్న రూ.1.50 లక్షలు కేటాయిస్తామని, నేడు రూ.650 కోట్లతో అభివృద్ధి చేస్తామంటున్నారని మండిపడ్డారు. రూ.80 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదా? లేదా మూసీ ప్రాజెక్టు గొప్పదా ? అని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.