calender_icon.png 27 August, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

25-07-2024 12:05:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. బుధవారం ఆయన బహదూర్‌పుర ఉమ్డా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా బడుల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు అంశాలపై సూచనలిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉం చాలని సూచించారు. విద్యార్థుల హాజరును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. పర్యటనలో డీఈవో రోహిణి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఆశన్న, డిప్యూ టీ డీఈవో ఏ సత్యవతి ఉన్నారు.