17-09-2025 03:39:35 PM
ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్, బీర్ల అయిలయ్య..
జనగామ (విజయక్రాంతి): బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా కలెక్టరెట్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య(MLA Beerla Ilaiah) ముఖ్య అతిధిగా విచ్చేయగా.. ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ష లోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పూలబొకేను అందించి ఘన స్వాగతం పలికిన అనంతరం.. పోలీస్ అధికారుల నుండి ముఖ్య అతిధి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించిన పిమ్మట, ముఖ్య అతిధితో పాటు ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ష లోమ్, డీసీపీ,జడ్పీ సీఈఓ మాధురి షా, ఆర్డివో అమర వీరుల స్తూపనికి నివాళులు అర్పించారు.
అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య జిల్లా లోని వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి గురించి సందేశం ద్వారా వివరించారు. వేడుకల అనంతరం.. ఈరోజు నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్చోత్సవ్ పక్షోత్సవాలను పురస్కరించుకొని.. స్వచ్ఛతా హి సేవ 2025 లో భాగంగా, కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే, ఆలేరు బీర్ల అయిలయ్య, ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ష లోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ సెల్ఫీ ఫోటోలు దిగి.. స్వచ్ఛతాయే మన నినాదం.. ఆరోగ్యమే అన్నింటి కన్నా ప్రధానమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివ రాజ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు వారి సిబ్బంది పాల్గొన్నారు.