calender_icon.png 17 September, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ..

17-09-2025 05:11:11 PM

హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ వచ్చింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) బుధవారం కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీ పేరు 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'గా ప్రకటించారు. హైదరాబాద్ లోని హోటల్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన పార్టీని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీల కోసమే ఈ పార్టీని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశ్యంతో పార్టీ ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు.