17-09-2025 03:31:24 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల చెరువులకు గండ్లు పడ్డాయని వాటిని పూడ్చివేసి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర మాజీమంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి(Former Minister Indrakaran Reddy) తెలిపారు. బుధవారం సోను మండలంలోని కడ్తాల్ గ్రామంలో తెగిన పెద్ద చెరువును పరిశీలించి అక్కడ ఒక రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. తూములో లీకేజీ ఏర్పడ్డ కారణంగానే గండి పడిందని రైతుల మాజీ మంత్రికి వివరించారు. ఈ విషయాన్ని ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణా రావు దృష్టికి తీసుకెళ్లి త్వరలో మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు తగిన పరిహారం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి చైర్మన్ ధర్మాజీ రాజేందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.