calender_icon.png 17 September, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు

17-09-2025 05:16:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్న కార్మికులు బుధవారం సమ్మెను విరమించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా సమ్మె చేయడంతో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వారితో చర్చలు జరిపారు. నెలరోజుల వేతనాలను వారి ఖాతాలో జమిచేసి మరో వారం రోజుల్లో మరో నెల వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించినట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.