17-09-2025 05:06:22 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గండిమైసమ్మ చౌరస్తా కార్యాలయం నందు మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాటి ఉప ప్రధాన కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని అలాంటి రాక్షస రజాకార్ల పాలన నుండి విముక్తి కల్పించారన్నారు.
నిజాం పాలనలో రజాకార్లు పన్ను చెల్లించని వారి చేతి గోర్లను ఊడగొట్టేవారని, ఇళ్లలోకి చొరబడి భర్తల కళ్లెదుటే భార్యలపై అత్యాచారం చేసిన దుర్మార్గపు పాలన అని గుర్తు చేశారు. అసలైన చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భవిష్యత్తు మనుగడకే ప్రమాదం ఉందని తెలిపారు. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి గోరమైన చరిత్ర కప్పిపుచ్చిన 60 ఏళ్ల నాటి అధికారం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.