17-09-2025 05:33:53 PM
నిర్మల్(విజయక్రాంతి): చెరువుల మరమ్మత్తుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే చెరువులకు గండు పడుతున్నాయని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు బుధవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో భారీ వర్షాలకు తెగిపోయిన పెద్ద చెరువును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంట నష్టపోయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువు తెగిపోవడంతో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఇసుక మేటలతో అపార నష్టం కలిగిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందేల చూస్తానని భరోసా ఇచ్చారు. చెరువు మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.