17-09-2025 05:26:04 PM
విశ్వ కర్మ కార్పొరేషన్ కోసం కృషి చేస్తా
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): తమ సృజనాత్మక శక్తి తో నూతన ఆవిష్కరణలు చేసే సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. బుధవారం విశ్వ కర్మ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్న యజ్ఞ మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విశ్వ కర్మ కార్పొరేషన్ కోసం క్యాబినేట్ మంత్రిగా తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మంచి విద్య తోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని ప్రజా ప్రభుత్వం అందుకు కృషి చేస్తోందని అన్నారు. నిరుపేద విశ్వకర్మ కుటుంబాలకు చెందిన మెడిసిన్,ఫార్మా,ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థులకు బాసటగా ఉంటానని, ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న వారికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సాయం అందిస్తామని భరోసా కల్పించారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిజమైన అర్హులను గుర్తించి వారి వివరాలు తనకు అందజేయాలని విశ్వ కర్మ కమిటీ సభ్యులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మలు పాల్గొన్నారు.