calender_icon.png 17 September, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వస్థ నారీ – శక్తివంత కుటుంబం

17-09-2025 05:20:26 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వద్ద ఉన్న మండల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “స్వస్థ నారీ – శక్తివంత కుటుంబ అభియాన్” కార్యక్రమాన్ని కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ గారు డాక్టర్ కల్పన, సిబ్బందితో కలిసి ప్రారంభించారు. 

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, యువతులకు ప్రత్యేక శ్రద్ధ, పోషకాహార లోపం నివారణ, అనీమియా తగ్గింపు, శానిటేషన్, మెన్స్ట్రుయల్ హైజీన్‌పై అవగాహన కల్పించనున్నారు. “ఆరోగ్యవంతమైన మహిళే కుటుంబ బలం – ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన పిల్లలే సమాజానికి శక్తి” అని కార్పొరేటర్ తెలిపారు.