calender_icon.png 17 September, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా విమోచన దినోత్సవం

17-09-2025 05:09:24 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ బిజెపి జిల్లా కార్యాలయంలో విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా తెలంగాణ విమోచన సులభం కాలేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్  సంకల్పం మరియు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో కారణంగా తెలంగాణ భారతదేశంలో విలీనం అయిందని, రాజాకార్లను,నిజాం పాలనను ఎదుర్కొని ప్రాణాలు అర్పించిన అమరవీరులకు మనం శిరసు వంచి నివాళులు అర్పించామన్నారు.

గ్రామాల్లో రాజాకార్లు పన్నిన క్రూరకాండలు, తెలంగాణ మహిళలపై జరిగిన దారుణాలను మనం ఎప్పటికీ మరచి పోలేమని,ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్వహించాలని, ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలను వదిలి ప్రజల భావాలను గౌరవించాలి అని అన్నారు.