calender_icon.png 14 May, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణకు స్థానిక కోటా ఇవ్వాలి

14-05-2025 12:00:00 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): ఈ విద్యాసంవత్సరం తెలంగాణ విద్యార్థులకు ఏపీ సైనిక్ స్కూల్స్‌లో 67 శాతం స్థానిక కోటా కొనసాగించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు ఏపీలోని సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ విద్యార్థులకు గతంలో మాదిరిగానే స్థానిక కోటా కొనసాగించాలన్నారు.

సైనిక్ స్కూల్ కోసం అడ్మిషన్ వేసిన విద్యార్థుల తల్లితండ్రులు పలువురు మంగళవారం మంత్రిని ఆయన నివాసంలో కలిసి రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ స్థానిక కోటాను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రంతో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ ఇవ్వాలని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.