calender_icon.png 14 May, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి జలగ.. జీవన్‌లాల్

14-05-2025 12:00:00 AM

  1. హైదరాబాద్ ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్ లీలలు
  2. సీబీఐ దర్యాప్తులో బయటపడుతున్న లంచాల బాగోతం

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ ముంబైలో ఆదివారం సీబీఐకి చిక్కిన హైదరాబాద్ ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్ జీవన్‌లాల్ కేసు దర్యాప్తులో అనేక కీలక అంశాలు  బయటపడుతున్నట్లు తెలుస్తోం ది. రెండున్నర కోట్ల విలువైన ఫ్లాట్‌ను ముంబైకి చెందిన ఎన్డీడబ్యూ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి లంచంగా తీసుకున్నట్లు సమాచారం.

ఆ ఫ్లాట్‌ను ఖమ్మం జిల్లాకు చెందిన బినామీ దండెల్ వెంకటేశ్వర్లు పేరిట రిజిష్ర్టేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. హవాలా ద్వారా రూ.35 లక్షల లంచాన్ని ముంబైలోని మరో రెండు సంస్థల నుంచి స్వీకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ట్యాక్సేషన్ ఫైల్ పెండిం గ్‌లో ఉన్నందున దాన్ని క్లియర్ చేసేందుకు షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి రూ.కోటి 20 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐకి సమాచారం అందింది.

రూ.15లక్షల లంచాన్ని ఇద్దరు మధ్యవర్తుల ద్వారా జీవన్‌లాల్  తీసుకోగా, మరో 70లక్షలు తీసుకునే సమయంలో పక్కా ఆధారాలతో సీబీఐ అధికారులు పట్టుకున్నారు. లంచం ఇచ్చిన వారి ని నిందితులుగా చేర్చిన సీబీఐ, ఈ వ్యవహారంలో మొత్తం 15 మందిపై కేసులు నమో దు చేశారు. జీవన్‌లాల్ ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కొడుకు.