calender_icon.png 22 August, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి పంది దాడిలో గాయపడ్డావారిని ఆదుకోవాలి

13-05-2025 11:59:45 PM

కుమ్రం భీం  అసిఫాబాద్ (విజయక్రాంతి): అడవి పంది దాడిలో గాయపడ్డ వారిని ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(Telangana Adivasi Tribal Association) జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ జిల్లా ఆటవిశాఖ అధికారి నీరజ్ కుమార్ ను కోరారు. మంగళవారం బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆసిఫాబాద్ మండలం కౌటా గూడ గ్రామంలో గత నెల 28న అడవి పందులు చోరబడి రాజు భాయి, రవి, ప్రేమలతలపై దాడి చేసిందని ఇప్పటివరకు వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకానంద్, కార్తీక్ బాధిత కుటుంబ సభ్యులు మోతిరాం, శివప్రసాద్, వెంకటేష్, గ్రామస్తులు విజయ, శ్రీకాంత్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.