10-12-2025 02:07:27 AM
సీనియర్ కాంగ్రెస్ నేత కే మురళీధర్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రదాత కాంగ్రెస్ అగ్రనేత సోని యా గాంధీ అని కాంగ్రె స్ సీనియర్ నేత కే ము రళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మంగళవారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మురళీధర్‌రెడ్డి మీడియాతో మాట్లా డు తూ విశ్వ నగరాల్లో హైదరాబాద్ ఒకటి ఉండాలని సోనియాగాంధీ ఆకాంక్ష సీఎం రేవంత్ రెడ్డి నేతృ త్వంలో రెండేళ్లు పూర్తి చేసుకున్నామన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సుకు విశ్వ వ్యాప్తంగా పేరు గల యాజమాన్య ప్రతినిధుల బృందాలు, 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులను తెలంగాణకు రప్పించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మురళీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు.