calender_icon.png 11 December, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13న రాధా గోవింద రథయాత్ర

10-12-2025 02:06:12 AM

వేడుకలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత

హైదరాబాద్(నార్సింగి/కోకాపేట్), డిసెంబర్ 9(విజయక్రాంతి): హరేకృష్ణ మూవ్’మెంట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13న,  శనివారం సాయంత్రం, కోకాపేట్ నుంచి నార్సింగిలోని హరేకృష్ణ హెరిటేజ్ టవర్ వరకు నాలుగో వార్షిక శ్రీరాధా గోవింద రథయాత్ర ఉత్సవం జరగనుంది.

ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసి ఈ ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా హరేకృష్ణ మూవ్’మెంట్ అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎంటెక్, ఐఐటీ మద్రాస్)  ఆహ్వానించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు.