20-09-2025 12:34:09 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ‘రాత్రి వచ్చిన ఆలోచనను మర్నాడే అమలు చేయ డం ఎవరికీ సాధ్యం కాదు. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా ఆలోచనను అమలు చేస్తారు. ట్రంప్ దూకుడు నిర్ణయాలతో ఆ దేశానికే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ట్రంప్ ఒకరోజు భారత ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడంటారు. మ రోరోజు భారత్‌పై అడ్డగోలుగా సుంకాలు విధిస్తారు.
ట్రంప్‌లాగానే నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిర్ణయాలు తీసుకునేవారు. అందుకే రాష్ట్రప్రజలు ఆయన్ను పక్కన పెట్టారు. దూకుడు నిర్ణయాలు ఎప్పటికీ ప్రజాసంక్షేమానికి పనికిరావు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ఇండియా’ 12వ వార్షికోత్సవానికి సీఎం హాజరయ్యారు. దేశ నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో సీఎం ‘విజన్ తెలంగాణ రైజింగ్ ’ అనే అంశంపై ప్రసంగించారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘విజన్ డాక్యుమెంట్- 2047 ’ను సిద్ధం చేశామని, డిసెంబర్ 9న ఆ డాక్యుమెంట్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం లో పెట్టుబడులు పె ట్టేందుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నామని, వారికి అన్ని విధాలుగా రాష్ట్రప్రభుత్వ సహా య, సహకారాలు ఉంటా యని హామీ ఇచ్చారు. ‘దేశంలో తెలంగాణ మేటి యువ రాష్ట్రం. మా రాష్ట్రం అ న్ని విధాలుగా అనుకూలం.
రాష్ట్రంలో పెట్టే ప్రతీ రూ పాయి పెట్టుబడి బంగారు మీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా మారుస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు విభాగాలుగా విభజించామని, కోర్ అర్బన్ ప్రాంతమైన ఒక్క హైదరాబాద్ లోనే కోటి మంది ప్రజల వరకు నివసిస్తున్నారని తెలిపారు. నగరానికి హాని చేసే కాలుష్యకారక పరిశ్ర మలను నగరం వెలుపలికి తరలిస్తున్నామని వెల్లడించారు.
అలాగే సెమీ అర్బన్ ప్రాంతాన్ని తయారీ రం గం (మాన్యుఫాక్చర్) జోన్‌గా భావిస్తున్నామని వివరించారు. రాష్ట్రాభివృద్ధికి తగినట్లు 70 కి.మీ మేర మె ట్రో రైలు సేవలను 150 కి.మీ మేర పొడిగిస్తామన్నారు. ప్రస్తుతం మెట్రో ద్వారా రోజుకు 5 లక్షల మం ది పయనిస్తున్నారని, ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని సబర్మతీ తీరంలా హైదరాబాద్‌నున మూసీ పరీవాహకాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
దీనిలో భాగంగానే తమ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. హైదరా బాద్‌లో ఎలివేటెడ్ కారిడార్లకు శ్రీకారం చుడుతున్నామని, 2027 నాటికి నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉంటాయని, ఈ లక్ష్యంతోనే తమ ప్రభు త్వం ఎలక్ట్రిక్ వాహన విక్రయాలపై భారీగా రాయితీలు ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మిస్తామని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
తెలంగాణకు బుల్లెట్ రైలు కోరాం..
హైదరాబాద్- బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు సౌకర్యం కావాలని తాము ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరామని సీఎం తెలిపారు. తెలంగాణలో బుల్లెట్ రైలు సౌకర్యం రావాలని ఆకాంక్షిస్తున్నామని వెల్లడించారు. విమానాశ్రయాన్ని భారత్ ఫ్యూచర్ సిటీకి అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డ్రగ్స్ విక్రయాలపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని, డ్రగ్స్ కట్టడిలో రాష్ట్రంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వివరించారు.
2032 కల్లా రాష్ట్రం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్నారు. భారత్ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు జ్ఞానంతో పాటు నైపుణ్యాలు అవసరమని, వారిలో నైపుణ్యాలు మెరుగుపరిచేందుకే తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ వర్సిటీలో చదివిన యువతకు ఉన్నతమైన కొలువులు వస్తాయని ఆకాంక్షించారు.
తెలంగాణ నుంచి వచ్చే క్రీడాకారులు దేశానికి ఒలింపిక్ పతకాలు తేవాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రం భూపరివేష్టిత రాష్ట్రమని, అందుకే తమకు ఓడరేవు లేదన్నారు. రాష్ట్రాన్ని ఏపీలోని మచిలీపట్నం ఓడ రేవు అనుసంధానించేందుకే తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తున్నదని వివరించారు. హైవేకు సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.