20-09-2025 12:59:29 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కొద్ది రోజుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శామ్ పిట్రోడా మరోసారి తన నోటికి పని చెప్పారు. గ్యాప్ ఇవ్వలేదు.. అదే వచ్చిందం టూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో ఉన్నా సొంతింట్లో ఉన్నట్టే ఉందని అన్నారు. ‘మన విదేశాంగ విధానంలో మొదట పొరుగుదేశాలపై దృష్టి సారించాలి.
మనం వారితో సంబంధాలను గణనీయంగా మెరుగుపర్చుకోగలమా? పొరుగుదేశాల వారు కష్టసమయంలో ఉన్నారు. వారితో పోరాడాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్‌కు వెళ్లినపుడు అక్కడ నా సొంతింట్లో ఉన్న అనుభవం కలిగింది. బంగ్లాదేశ్, నేపాల్‌లో కూడా అలాంటి అనుభూతే కలిగింది. నేను విదేశంలో ఉన్నట్టు ఎక్కడా అనిపించలేదు. అక్కడి వారు చూ సేందుకు నాలానే ఉన్నారు. నాలాగే మాట్లాడారు.
వారు నా పాటలు ఇష్టపడ్డారు. నా ఆహారం పుచ్చుకున్నారు. వారితో శాంతి, సామరస్యంతో జీవించడాన్ని మనం నేర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. శామ్ పిట్రో డా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శల వర్షం గుప్పిస్తోంది. ‘మౌనం అంగీకారం, పిట్రోడా వ్యాఖ్యలు పాకిస్థాన్‌పై కాంగ్రెస్‌కు ఉన్న సాఫ్ట్ కార్నర్‌ను చూపుతున్నాయి’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఆరోపించారు.
ముంబైలో దాడులు చేసినా వదిలేశారు
యూపీఏ ప్రభుత్వంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు ముంబైలో దాడులు చేసినా కానీ వారి వదిలిపెట్టారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ట్వీట్ చేశారు. ‘శామ్ పిట్రోడా వ్యాఖ్యల్లో ఏం ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్‌కు పాకిస్థాన్ అంటే ఇష్టం. అందుకోసమే ముంబై దాడుల సమయంలో కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలు సైనికులను అవమానించడ మే. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు నిశబ్దంగా ఉన్నారు.
గతంలో పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది రాహుల్ గాంధీ తన మార్గదర్శకుడని అన్నా రాహుల్, సోనియా స్పందించలేదు. మీ నిశబ్దం శామ్ పిట్రోడా వ్యాఖ్యలను అంగీకరించినట్టే ఉంది. వారు భారత ప్రజాస్వామ్యంలో అశాంతిని నెలకొల్పాలని ప్రయత్ని స్తున్నారు. కాంగ్రెస్‌తో సంభాషించినట్టు ఉగ్రవాది హఫీజ్ సయీద్ ప్రత్యక్షంగా పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ప్రతి ఉగ్రవాది రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ను పొగుడుతున్నారు. వారి ఉద్దేశం దేశ్-ప్రేమ్ కాదు పాకిస్థాన్-ప్రేమ్’ అని ప్రదీప్ బండారి విమర్శించారు.