calender_icon.png 30 September, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపికైన తెలంగాణ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్ విద్యార్థిని

29-09-2025 10:56:19 PM

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణ సౌత్ క్యాంపస్‌లో జియో ఇన్ఫర్మేటిక్  చదువుతున్న విద్యార్థినికి గ్రూప్-2 ఫలితాల్లో ఎస్‌ఐగా కంకణాల శ్రీజా రెడ్డి ఎంపికయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, సౌత్ క్యాంపస్  డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న శ్రీజా రెడ్డి ది కరీంనగర్ జిల్లాకు చెంది  రాధిక -జైపాల్ రెడ్డిల కుమార్తె కంకణాల శ్రీజా రెడ్డి  కీ తెలంగాణ  పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన  గ్రూప్-2 ఫలితాలలో ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపిక అయ్యారు.

మొన్న ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో సైతం ఎంపీడీఓగా ఎన్నికయ్యారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు రావడంతో శ్రీజరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.సుధాకర్ గౌడ్, డిపార్ట్మెంట్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. సౌత్ క్యాంపస్ అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.