calender_icon.png 10 May, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్ధులు చేరాలని అధ్యాపకులు ఇంటింటి ప్రచారం

09-05-2025 09:42:04 PM

నడిగూడెం: పదవ తరగతి ఉత్తీర్లైన విద్యార్థులు ఇంటర్లో నడిగూడెం కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కోరుతూ అధ్యాపకులు శుక్రవారం పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలు ఈ ఏడాది ఇంటర్లో కళాశాల విద్యార్థులు సాధించిన ఫలితాలతో కూడిన కరపత్రాలను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందజేస్తూ ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం నిర్వహించారు. నడిగూడెం మండలంలో బృందావనపురం తెల్లబల్లి, మునగాలమండలంలో కలకోవా జగన్నాధపురం గ్రామాల్లో ప్రచార నిర్వహించారు.  కార్యక్రమంలో అధ్యాపకులు జాన్ పాషా శ్రీధర్ కృష్ణ మహేష్ నాగరాజు ఈశ్వర్ ఉపేందర్, వీరన్న , మదారు ,నగేష్ తదితరులు పాల్గొన్నారు.