09-05-2025 12:18:21 AM
మేడ్చల్, మే 8(విజయ క్రాంతి): ఆపరేషన్ సిందూర్ విజయవంత మైన సందర్భంగా గుండ్ల పోచం పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో విజయో త్సవం నిర్వహించారు.
విద్యార్థిను లందరూ తరగతి గదుల నుంచి బయటకు వచ్చి జాతీయ జెండా చేతబట్టి జవాన్లకు సంఘీభావం ప్రకటించారు. మేమంతా మీ వెంట ఉన్నామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, విద్యా సంస్థల చైర్మన్ చామకూర మల్లారెడ్డి మాట్లా డుతూ మన సైనికులు ఉగ్రవాదుల స్థావరాల పై దాడులు చేసి విజయం సాధించారన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆర్మీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులందరి ఏరి వేయాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదని, ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఉగ్రవాదుల శవాలకు అధికార అంచనాలతో అంత్యక్రియలు చేశారంటే ఉగ్ర దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అర్థమవుతుందన్నారు.
జవహర్ నగర్ లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీఎంఆర్ హాస్పిటల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యా లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మేకల కావ్య, మాజీ కార్పొరేటర్ లతా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.