calender_icon.png 10 May, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి... నా ధ్యేయం

09-05-2025 09:58:01 PM

ఉద్యమ నేత, ఎమ్మెల్యే మందుల సామెల్ 

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గంలో శుక్రవారం స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్   పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుంకరీ జనార్ధన్, రేగటి రవి ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ పుణ్య దంపతులకు పట్టు వస్త్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాభిమానం చూరగొన్న నేతగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు మిఠాయిలు తినిపించిన వారు కార్యకర్తలకు స్వీట్లను పంచి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగటి వెంకటేష్, దాసరి శ్రీను, కందుకూరి లక్ష్మయ్య తోపాటు పార్టీ నాయకులు, తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.