09-05-2025 10:01:30 PM
ముత్తారం,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి -మంథని ప్రధాన రహదారి రంగయ్యపల్లి మూలమలుపు వద్ద గోదావరిఖనికి చెందిన శత్రువేదుల శ్రావణ్ తన సోదరుడు శశిధర్ ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి జిల్లా జంగంపల్లి నుంచి గోదావరిఖనికి తిరుగు ప్రయాణంలో రంగయ్యపల్లి మూలమలుపు వద్ద ఉన్న టేకు చెట్లను ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో బైకు నడుపుతున్న శ్రావణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. శశిధర్ కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 సమాచారం ఇవ్వగా గాయపడ్డ వారిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.