09-05-2025 10:19:55 PM
దౌల్తాబాద్,(విజయక్రాంతి): ఈనెల 12 న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి, కార్యదర్శి సూరంపల్లి మహేందర్ లు అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడిందని అన్నారు. 50 ఏళ్ల చరిత్రను, కృషిని, సృజించుకునే పనితో పాటు అరుణోదయం సావనీర్, అరుణోదయ డాక్యుమెంటరీ, విప్లవ ప్రజా సంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించుకుంటూ జరిగే అరుణోదయ 50 ఏళ్ళ పరిపూర్తి ముగింపు సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎల్లం, మల్లేశం,కీసర ఎల్లం, పిట్ల మల్లేశం, ఎమ్మార్పీఎస్ నాయకులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.