21-07-2025 07:48:54 PM
హైదరాబాద్: తెలంగాణ యువతకు అధునాతన నైపుణ్య శిక్షణ అందించేందుకు సంకల్పించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ATC)ఏర్పాటు, పురోగతి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ కు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా ఎటీసీలను తీర్చిదిద్దాలని సూచించాను. రాష్ట్రంలో ఫేజ్-1లో 25, ఫేజ్-2లో 40, ఫేజ్-3లో 46 ఎటీసీలను అభివృద్ధి చేస్తున్నామని, ఈ సమీక్షలో వాటి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఫేజ్-1, ఫేజ్-2లో ఇప్పటి వరకు 49 అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. అన్నీ ఎటీసీలను వీలైనంత త్వరగా పూర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఎటీసీని ఏర్పాటు చేసి ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకట స్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.