09-10-2025 12:21:31 AM
- ప్రో కబడ్డీ 12వ సీజన్
చెన్నై , అక్టోబర్ 8: ప్రో కబడ్డీ 12వ డలో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతోంది. సమిష్టిగా రాణి స్తూ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ 46 స్కోరుతో హర్యానా స్టీలర్స్ ను చిత్తు చేసింది. ఆల్ రౌండర్ భరత్ (20 పాయింట్లు), కెప్టెన్ విజయ్ మాలిక్ (8 పాయింట్లు) చెలరేగడంతో ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసింది. ఆడిన 13 మ్యాచ్ లలో 8 విజయాలు సాధించిన తెలుగు టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్ లో కొనసాగుతోంది.మరో మ్యాచ్ లో పుణెరి పల్టాన్ 37 స్కోరుతో యూ ముంబాపై విజయం సాధించింది.