calender_icon.png 11 October, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్ ఫైనల్లో భారత్

09-10-2025 12:22:32 AM

గుహావటి , అక్టోబర్ 8 : వరల్డ్ జూనియర్ మిక్సిడ్ టీమ్ ఛాంపియన్ షిప్ లో భారత్ అదరగొడుతోంది. వరుసగా మూడో విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గుహావటిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ తన మూడో మ్యాచ్ లో 2 45 స్కోరుతో యుఏఈపై ఘనవిజయం సాధించింది. యూఏఈ నుంచి పెద్దగా పోటీ ఎదురుకాకపోవడంతో ఈజీగానే గెలిచింది.

మెన్స్ సింగిల్స్ , మెన్స్ డబుల్స్ తప్పిస్తే మిగిలిన కేటగిరీల్లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. యూఏఈపై విజయంతో గ్రూప్ టాపర్ గా నిలిచిన భారత్ క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. తొలి మ్యాచ్ లో నేపాల్ పైనా, రెండో మ్యాచ్ లో శ్రీలంకపైనా భారత్ జట్టు సునాయాసంగా విజయాలను అందుకుంది. కాగా క్వార్టర్ ఫైనల్లో గురువారం భారత్ దక్షిణకొరియాతో తలడుతుంది. తొలిసారి ఈ టోర్నీని కొత్త రిలే పద్ధితిలో నిర్వహిస్తున్నారు.