calender_icon.png 11 October, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంగారూలను ఊడ్చేశారు

09-10-2025 12:20:02 AM

భారత్ అండర్ 19 జట్టు ఘనవిజయం

మెక్‌కే, అక్టోబర్ 8: భారత అండర్ 19 జట్టు కంగారూ గడ్డపై దుమ్మురేపింది. యూత్ వన్డే సిరీస్ తో పాటు యూత్ టెస్ట్ సిరీస్ ను సైతం స్వీప్ చేసింది. రెండురోజుల్లోనే ముగిసిన రెండో యూత్ టెస్టులోనూ ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.బౌలర్ల హవా కొనసాగిన ఈ మ్యాచ్ లో కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం భారత్ విజయానికి కారణమైంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ అండర్ 19 జట్టు  135 పరుగులకే ఆలౌటైంది.

తర్వాత తొలి ఇన్నింగ్స్ లో భారత్ 171 పరుగులు చేయడంతో 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత యువ బౌలర్లు అదరగొట్టారు. కంగారూ కుర్ర టీమ్ ను కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 81 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ తడబడినా వేదాంత్ త్రివేది(33), విహాన్ మల్హోత్ర(21) రాహుల్ కుమార్ (13) రాణించడంతో ఛేదించింది. అంతకుముందు యూత్ వన్డే సిరీస్ ను కూడా భారత్ స్వీప్ చేసింది.