calender_icon.png 13 November, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు టైటాన్స్ థ్రిల్లింగ్ విజయం

21-11-2024 12:00:00 AM

ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ డ్రా

నోయిడా: పీకేఎల్-11వ సీజన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. దబంగ్ ఢిల్లీ-గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ 39-39తో డ్రాగా ముగిసింది. ఢిల్లీ కెప్టెన్ అషూ మాలిక్ సూపర్ టెన్ సాధించాడు. గుజరాత్‌లో రెయిడర్ ప్రతీక్ దహియా 20 పాయింట్లు సాధించాడు. ఇక మరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31-29 తేడాతో యూ ముంబాపై థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరి నిమిషంలో   సూపర్ టాకిల్ పాయింట్లు సాధించి ఊపిరిపీల్చుకుంది. పవన్ షెరావత్ గైర్హాజరీలో విజయ్ మాలిక్ కెప్టెన్సీ చేశాడు. టైటాన్స్ జట్టు తరఫున ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించాడు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్ తో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్‌తో హర్యానా స్టీలర్స్ తలపడనున్నాయి.