21-11-2024 12:00:00 AM
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ
పెర్త్: బోర్డర్ గావస్కర్ టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియాను గాయాల బెడద ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గాయంతో గిల్ తొలి టెస్టుకు దూరం కాగా తాజాగా రిజర్వ్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్ గాయం బారీన పడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఖలీల్ స్థానంలో యశ్ దయాల్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఖలీల్ అహ్మద్ బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కూడా జట్టుతో ఉన్నా అతడికి మా త్రం తుది జట్టులో చోటు దక్కలేదు.