21-11-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో జరగనున్న అంధుల టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత అంధుల జట్టు టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. భారత ప్రభుత్వ నిర్ణయం ఎంతో బాధించిందని జట్టు కెప్టెన్ దుర్గారావు అన్నారు.
‘మేము దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తాం. పెద్ద వేదికల్లో సత్తా చాటేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం. టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం కోల్పోవడం ఎంతో బాధించింది’ అని విచారం వ్యక్తం చేస్తూ కెప్టెన్ దుర్గారావు ప్రెస్ నోట్ విడుదల చేశాడు.