22-05-2025 01:19:12 AM
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): ఇక నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కార్యకలాపాలు సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరుతో నే కొనసాగనున్నాయి. తెలంగాణ శాసన సభలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణ రాజపత్రం ద్వారా పేరును మార్పుచేస్తూ ప్రభుత్వ నిర్ణ యం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇక నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన అన్ని కార్య కలాపాలు సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరుతో జరగనున్నాయి.