calender_icon.png 23 May, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి

22-05-2025 01:16:57 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మే 21 ( విజయక్రాంతి ) : రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.బుధవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వనపర్తి జిల్లాకు మొత్తం 126.34 కోట్లు సబ్సిడీ రూపంలో మంజూరు కాగా 28110 దరఖాస్తు లు వచ్చాయి. ఇందులో వనపర్తి నియోజక  వర్గానికి రూ. 72.03 కోట్లు మంజూరు కాగా 15 388 దరఖాస్తులు వచ్చాయి. మక్తల్ నియోజవర్గానికి సంబంధించి 14.00 కోట్లు మంజూరు కాగా 3114 దరఖాస్తులు రావడం జరిగింది. దేవరకద్ర నియోజకవర్గంలో 4334 మంది దరఖాస్తులు చేసుకోగా 9.24 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి.

కొల్లాపూర్ నియోజకవర్గానికి రూ. 22.19 కోట్లు మంజూరు చేయగా 5274 దరఖాస్తులు వచ్చాయి.  ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీ శాఖలకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక మే చివర నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, పిడి డిఆర్డిఓ ఉమాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, మైనార్టీ కార్పొరేషన్ అధికారి అఫ్జలుద్దీన్   పాల్గొన్నారు.