calender_icon.png 28 January, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయలసీమ నేపథ్యంలో దేవగుడి

28-01-2026 12:34:08 AM

బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ రచనా దర్శకత్వం, నిర్మాణంలో వస్తున్న చిత్రం ‘దేవ గుడి‘. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 30న రిలీజ్ కానున్న ఈ చిత్ర విశేషా లను దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి, నటుడు రఘు కుంచె వెల్లడించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “-దేవగుడి’ దర్శకుడిగా నా రెండో చిత్రం. దర్శకుడిని, నిర్మాతను నేనే కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలి గాను.

సురేశ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మెయిన్‌గా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. నార్మల్ టికెట్ రేట్స్ పెడుతున్నాం. సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులను ప్రోత్సహించేందుకు టికెట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం” అన్నారు. రఘుకుంచె మాట్లాడుతూ.. “సినిమాలో నేను జీబులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీబ్స్ వస్తుంటాయి.

నాకు రియల్ లైఫ్‌లో అలాంటి సందర్భం రాదు కాబట్టి వీరారెడ్డి పాత్రలో నటించడాన్ని ఎంజాయ్ చేశా. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చా. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. సిన్సియర్‌గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నా” అన్నారు.