calender_icon.png 28 January, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలకు రిలేట్ అయ్యే ఓం శాంతి శాంతి శాంతిః

28-01-2026 12:35:44 AM

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతు న్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. జనవరి 30న విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఈషా రెబ్బా మాట్లాడుతూ.. “ఇందులో శాంతి పాత్రలో నటించా. నా క్యారెక్టర్‌తో ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది. ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా ఇది” అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో సినిమాలు నిర్మించడం చాలా కష్టమైన పని. ఇలాంటి సమయంలో ప్రొడ్యూసరే హీరో. ఈషా శాంతి క్యారెక్టర్‌కు ప్రాణం పోశారు. తను రియల్ లైఫ్‌లో కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా శాంతిగా ఉంటారు. ఈ సినిమాకి హీరో ఈషా” అని చెప్పారు. ‘చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్తదనం ఇస్తుంద’ని డైరెక్టర్ సజీవ్ అన్నారు. ఈ వేడుకలో ప్రొడ్యూసర్లు సృజన్, అనూప్, వివేక్, బీవీఎస్ రవి, హీరోలు విశ్వక్‌సేన్, ప్రియదర్శి, అభినవ్, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్, మూవీ టీమ్ పాల్గొన్నారు.