calender_icon.png 7 July, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి వన మహోత్సవం

07-07-2025 01:10:21 AM

- ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

- రాష్ర్ట వ్యాప్తంగా 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టను న్న వన మహోత్సవం సోమవారం నుంచి మొదలు కానున్నది. ఆదివారం సీఎం రేవం త్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు.

వన మహోత్సవానికి అటవీశాఖ అధికారులు నెల రోజుల నుంచి తీవ్ర కసరత్తు చేస్తున్నా రు. ఇతర డిపార్టుమెంట్ల ఉన్నతాధికారుల సమన్వయంతో మొక్కలు నాటే కార్య క్రమా న్ని విజయవంతంగా పూర్తిచేయాలని ప్రణాళికలు రూపొందించారు. వర్షాలు కు రుస్తు న్న ప్రాంతాల్లో మొక్కలు నాటే నాటేందుకు సిద్ధమైయ్యారు. ఈ ఏడాది రాష్ర్ట వ్యాప్తంగా 18.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం  లక్ష్యంగా పెట్టుకున్నది.