26 February, 2026 | 4:28 AM

వార్షిక పరీక్షలకు పదో తరగతి విద్యార్థులు సన్నద్ధం కావాలి

26-02-2026 12:37 AM
  1. వంద శాతం ఫలితాలు సాధించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ,ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి):పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధమై మంచి ఫలితాలు సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ లోని జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని ఏడు, పదో తరగతులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.

విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించిన పలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో బోర్డుపై పాఠ్యాంశానికి సంబంధించిన వివరాలను రాయించారు. ఇంగ్లీషులో రాయడం, చదవడం గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షల సమీపిస్తున్నాయని, విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించి పూర్తిస్థాయిలో సన్నద్ధత కావాలని అన్నారు. వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.

ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులు బాగా చదవాలన్నారు. విద్యార్థులను చదువుల్లో మరింత ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించి కిచెన్ షెడ్డును పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఏం వండుతున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులకు వంట చేశారని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, తహసిల్దార్ రాజు, ఎంఈవో మనోజ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.