11-01-2026 12:16:29 AM
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): మణికొండలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివా రం ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ మణికొండ మహిళా అధ్యక్షురాలు పటోళ్ల రూపారెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. మహిళలలోని కళాత్మక ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్య లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన ముగ్గులతో ఆకట్టుకున్నారు. మొదటి బహుమతిగా రూ.5వేలు, రెండో బహుమతిగా రూ.2వేల నగదు బహుమతులను ప్రక టించారు.ఈ పోటీల్లో సంతోషి, సునీత, స్వాతి, వనజ విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు.