10-01-2026 12:35:06 AM
కన్నీటి విషాద ఘటనకు 29 ఏళ్లు
భద్రాద్రి కొత్తగూడెం, / కరకగూడెం జనవ రి 9 (విజయక్రాంతి) : ఆది,1997, జన వరి 9 అర్ధరాత్రి సుమారు 2 గంటల సమ యం.. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె ఒకసారిగా ఉలిక్కి పడింది. ప్రజలు పిడుగుపాటులాంటి భారీ శబ్దాన్ని విన్నారు. కొన్ని క్షణాల పాటు భయంతో వణికి పోయారు. కాస్త తేరుకున్నాక ఏ మైందో తెలుసుకుందామని అటు వైపు పరుగులు తీశారు. అక్కడకు వెళ్లాక చెల్లా చెదురైన మృతదేహాలు.. క్షతగాత్రుల ఆర్తనాదాలు.
ధ్వంసమైన పోలీస్ స్టేషన్, భయానక వాతావరణాన్ని చూసి చలించిపోయారు. ఆ విషాదం.. మరువ లేనిది. పినపాక నియోజకవర్గం లోని కరకగూడెం పోలీస్ స్టేషన్ ఫై రెండు దశాబ్దాల క్రితం మావోయిస్టులు మెరుపు దాడి చేసి 16 మంది పోలీసులను బలిగొన్న విషాద సంఘట నకు నేటితో 29ఏళ్లు పూర్తయ్యాయి. పోలీస్ కుటుంబాల్లో కన్నీటిని నింపిన ఆనాటి విషాద ఘటన పై విజయక్రాంతి అందిస్తున్న కథనం..
కన్నీటి విషాద ఘటనకు 29 ఏళ్లు...
మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని కర కగూడెం అప్పటి (పినపాక) మండలంలో సుమారుగా రెండు దశాబ్దాల క్రితం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. పోలీసు వర్సెస్, మావోయిస్ట్ అన్న చందంగా సమాంతర ప్రభుత్వాన్ని తలపించే రీతిలో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరేవారు. అయితే వారిని అణచివే సేందుకు పోలీసుశాఖ ఎప్పటి కప్పుడు ప్రత్యేక వ్యూహాలతో మావోయిస్టుల అణిచివేతకు చర్యలు చేపట్టేవారు.
ఒకరిపై మరొకర పై చేయి సాధించేందుకు ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగేది. ఈ క్రమంలో ఆనాటి మావోయిస్టులు ఒక్క అడుగు ముందుకు వేసి పోలీసులపై ఫై చేయ్యి సాధించేందుకు పకడ్బందీగా వ్యూహం రచించారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయం లో సుమారు 100 మంది మావోయిస్టులు సాయుధులై, కరకగూడెం(అప్పుడు పినపాక మండలంలో ఉండేది) పోలీస్ స్టేషన్ పై మెరుపు దాడి చేశారు.
ఓ వైపు కాల్పులతో పాటు, బాంబుల తో స్టేషన్vను పేల్చివేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 16 మంది స్టేషన్ రక్షణ బాధ్యతలు వహించే పోలీసులను బలిగొన్నారు. పోలీస్ ఠాణా మొత్తం లూటి చేసి, మొత్తం మందుగుండు, తుపాకులను అపహరించారు. పోలీస్ సిబ్బంది బీహెచ్‌ఎఫ్ సెట్ ద్వారా సమీపంలోని ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ కు అదనపు సాయం కావాలని సమాచారం అందించి ప్రతిదాడి చేసేలోపే మావోయిస్టు లు పోలీస్ స్టేషన్ ను మొత్తం తమ స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు.
ఇప్పటికీ కన్నీటికి కష్టాలే...
మావోయిస్టుల మెరుపుదాడి నుండి గ్రామస్తులు తెరుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చే సరికే ఠాణాలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పాండవ, కిన్నెర, ఏటూరునాగారానికి చెందిన జంపన్న దళాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. మృతిచెందిన 16 మందిలో 8 మంది సివిల్ పోలీసులు, ఏపీఎస్పీకి చెందిన 5వ బెటాలియన్ (విజయనగర)కు చెందిన 8 మంది పోలీసులు ఉన్నారు.
ఆ ఘోరాన్ని చూసిన వారు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. బాధితులుగా మిగిలిన వారి కష్టాలు ఇంకా తీరలేదు. భర్తను కోల్పోయిన భార్య, పిల్లలు, కుమారుడు దూరమైన బాధలో తల్లిదండ్రులు కన్నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.
నాడు రాష్ట్రంలోనే పెను సంచలనం...
పోలీస్ స్టేషన్ పేల్చివేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఆ నాటి సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి హోం మంత్రి ఎలిమిలేటి మాధవరెడ్డి, మరో మంత్రి తుమ్మల తో కలిసి కరకగూడెం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఏజెన్సీ ప్రజలతో సత్ససంబంధాలు కొనసాగిస్తూ, మావోయిస్టు కార్యక లాపాలకు పూర్తిగా చెక్ పెడుతూ వచ్చారు. కరకగూడెం పోలీస్ స్టేషన్ను అత్యంత ఆధునికంగా దాడులను ప్రతిఘటిం చేలా నిర్మించారు.
ఇప్పటికీ మర్చిపోలేం..
29 యేళ్ల క్రితం మావోయిస్టులు కరకగూ డెం పోలీస్ స్టేషన్ పై దాడి సంఘటనను ఇప్పటికీ మరువలేకపోతున్నాం. ఆ రో జూ రాత్రి మా గ్రామాన్ని పూర్తిగా మావో యిస్టులు తమ ఆధీనంలోకి తీసున్నారని,మేము భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ గ్రామస్తులు చెప్తున్నారు. కరక గూడెం పోలీస్ స్టేషన్ పేల్చివేతలో ప్రధాన సూత్రధారి, మావోయిస్టు అగ్రనేత జంపన్న అలియాస్ జి నర్సింహారెడ్డి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో పోలీసుల సమక్షంలో తన భార్యతో కలిసి లొంగిపోయాడు. అయినా మరుభూమిలా అర్ధరాత్రి వేళ బాంబులు, తూటాల శబ్దాలతో గ్రామం దద్ధరిల్లింన ఘటనను ఇప్పటికీ గ్రామస్తులు మర్చిపోవడం లేదు.
అమరుల ఆశయ సాధనే లక్ష్యం..
పోలీస్ అమరుల ఆశయ సాధనే మా లక్ష్యం. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు వదిలిన వారి ఆశయా లను స్మరించుకుంటూ విధులు నిర్వహిస్తున్నాం. పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత, ఏజెన్సీలోని ప్రజల రక్షణ బాధ్యతగా తీసుకున్నాం, మావోయిస్టుల నుండి ప్రజలకు రక్షణ కల్పించాం
వంగా రవీందర్ రెడ్డి, డీఎస్పీ మణుగూరు