calender_icon.png 11 January, 2026 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

10-01-2026 12:35:42 AM

కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, జనవరి 9 : మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మీటింగ్ హాల్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి అంజయ్య, శ్రీనిధి రీజినల్ మేనేజర్ వెంకటరమణలతో కలిసి శ్రీనిధి రుణాలు, బ్యాంకు లింకేజ్‌ల మంజూరు, రికవరీలపై జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, సెర్ప్ ఆధ్వర్యంలోని శ్రీనిధి సిబ్బంది, సామాజిక సమన్వయకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అన్ని రంగాలలో రాణించేందుకు తోడ్పాటు అందిస్తుందన్నారు. రాష్ట్ర స్థాయిలో రికవరీ పరంగా 25వ స్థానంలో కొనసాగడం జరుగుతుందని, జిల్లాలో తక్కు వ రికవరీ ఉన్న మండలాల ప్రతినిధులు రికవరీ శాతాన్ని పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాలోని నస్పూర్ లో గల సి.సి. కార్నర్ లో రూరల్ సెల్ఫ్ ఎం ప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తా మని, 18- సంవత్సరాల మధ్య వయసు గల గ్రామీణ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.