calender_icon.png 11 January, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నియమాలతో ప్రమాదాలు దూరం

10-01-2026 12:33:43 AM

నిర్మల్ నవంబర్ 9 (విజయ క్రాంతి) : రోడ్డుపై ప్రయాణం చేసే వాహనదారులు ప్రజలు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలను పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత అవగాహన సదస్సులో భాగంగా లారీ డ్రైవర్లకు వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ వినియోగించవద్దని మద్యం గుట్కా పానీయాలకు దూరంగా ఉండాలని విశ్రాంతి ఎక్కువ తీసుకోవాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.