12-05-2025 01:56:34 AM
దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘ఫ్రైడే’. ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శక త్వంలో కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ఆదివారం ఈ సినిమా లోని అమ్మపాట ను ఏపీ హోం మంత్రి అనితతో రిలీజ్ చేయించారు.
అనంతరం డైరెక్టర్ ఈశ్వర్‌బాబు మాట్లాడుతూ.. ‘మా సినిమా చూసిన తర్వాత ప్రతీ తల్లి తన కొడుకును ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్ సింగ్‌లా పెంచుతారు. పోరాడే శక్తిని అమ్మ మాత్రమే ఇస్తుంది’ అన్నారు. ‘ఈశ్వర్ చెప్పిన కథ నా మనసుకు తాకింది’ అని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. నటీనటులు రోహిత్, దియా రాజ్, రిహానా, కల్పిక, స్నిగ్ధ నయని, ఇనయ సుల్తానా, చిత్రబృందం పాల్గొన్నారు.