calender_icon.png 14 May, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతుల్ని కలిపితే బలపడిపోవా బంధాలు..

12-05-2025 01:54:27 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి తాజాగా థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 

‘డమ్ డమారే’ అనే ఈ పాట.. సినిమాలో ముగ్గురు హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని ఆవిష్కరిస్తోంది. ‘భోగి మంటల్లో తోసేద్దామా బాధలు.. కష్టాలు కన్నీళ్లు మోస్తూ ఇంకా ఎన్నాళ్లూ.. చుక్కలు కలిపితే ముంగిట్లోన ముగ్గులు.. చేతుల్ని కలిపితే బలపడిపోవా బంధాలు.. అరెరే.. ఇట్టాగ చెలిమి కొరకు.. ఎవరూ అనలేదిదివరకూ.. అరెరే.. ఎంత అన్నదమ్ములైనా మనలాగ ఉంటారా జల్లెడేసి వెతుకు.. డమ్ డమారే..

దుమ్మురేగాలిలే.. డమ్ డమారే.. సంకురాత్రి పండగొచ్చె.. సంబరాలే సాగాలిలే..’ అంటూ సాగుతోందీ పాట. శ్రీచరణ్ పాకాల స్వరాలు, భాస్కరభట్ల గీత సాహిత్యం, రేవంత్, సాహితి చాగంటి గాత్రం వినసొంపుగా ఉన్నాయి. ఈ చిత్రానికి డీవోపీ: హరి కే వేదాంతం; సంగీతం: శ్రీచరణ్ పాకాల; మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్; సాహిత్యం: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చైతన్యప్రసాద్, బాలాజీ, తిరుపతి; ఫైట్స్: రామకృష్ణ, నటరాజ్ మడిగొండ.