17-12-2025 12:00:00 AM
హుజురాబాద్, డిసెంబరు 16 (విజయ క్రాంతి): జిల్లాలో ఈ నెల 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హుజురాబాద్, వీణవంక మండలాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను మంగళవారం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎఫ్ ఎస్ టీ, ఎస్ ఎస్ టీ టీంలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చామని, ఈ సీ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు.
బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రి సరి చూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.