calender_icon.png 17 December, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడి కుటుంబాన్ని ఓదార్చిన నాయకులు

17-12-2025 12:00:00 AM

చిట్యాల, డిసెంబర్ 16(విజయ క్రాంతి): మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం వారిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. చిట్యాల మండలం తాళ్ల వెళ్ళాంల గ్రామానికి చెందిన జంపాల రాములు అనారోగ్యంతో  మృతిచెందగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుడి  కుటుంబాన్ని పరామర్శించి, నివాళులర్పించారు.

మృతుడి మనవడు అయిన జంపాల వినయ్ ను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించి,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జనగాం అంజయ్య గౌడ్ 5000, 3వ వార్డ్ మెంబర్ నీలం వెంకన్న ముదిరాజ్ 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చికిలం మెట్ల సైదులు, సర్పంచ్ జోగు సురేష్, పామునుగుళ్ళ బుచ్చి రాములు, పామునుగుళ్ళ మారేష్,  కొమ్మనపల్లి మల్లేష్, నల్లబెల్లి నరేష్, మాలిగ చంద్రం, జోగు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.