calender_icon.png 30 October, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోపణలు అవాస్తవం

30-10-2025 05:35:39 PM

వీడియో ద్వారా స్పష్టం చేసిన ఎంపీడీవో

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల ఈజిఎస్ టిఏ దుగుట భార్గవ్ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్ గురువారం వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఈ నెల 28న జ్వరం, జాండీస్, తల సేమియా వ్యాధితో బాధపడుతూ భార్గవ్ మరణించాడు అని తెలిపారు. తాను టీఏ భార్గవ్ అంత్యక్రియలకు వెళ్లే క్రమంలో తనపై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని, దీంతో తాను అంత్యక్రియలకు వెళ్లకుండా వెన్నుతిరిగినట్లు తెలిపారు.

బెల్లంపల్లి మండలానికి చెందిన మాజీ ఎంపిటిసి ముడిమడుగుల మహేందర్, మాజీ టిఏ గోమాస శ్రీకాంత్, ఈజీఎస్ ఈసీ అనిల్ కుమార్, ఈజీఎస్ ఏపీవో ఎస్టర్ డేవిడ్, జునుగురు సతీష్ అనే వ్యక్తులు తాను మామూళ్ల కోసం వేధిస్తున్నట్లు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని స్పష్టం చేశారు. ఈజీఎస్ పనులకు సంబంధించి 145 సైన్ బోర్డులు పెట్టకుండా రూ. 5.80 లక్షలు స్వాహా చేయడంతో ఈజీఎస్ సిబ్బందికి తాను మెమో ఇచ్చి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. టిఏ భార్గవ్ మరణాన్ని రాజకీయంగా వాడుకొని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీడియో ద్వారా ఎంపీడీవో మహేందర్ స్పష్టం చేశారు.