calender_icon.png 31 October, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరవళ్లు తొక్కుతున్న మూసీ

30-10-2025 05:34:01 PM

9 గేట్లు ఎత్తివేత 

ఇన్ ఫ్లో 45042.61 అవుట్ ఫ్లో 

51990.66 క్యూసెక్కుల నీటి విడుదల

నకిరేకల్ (విజయక్రాంతి): హైదరాబాద్ తో పాటు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగి ఉగ్రరూపం దాల్చింది. ఇన్ ఫ్లో 45042.61 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో గురువారం మూసీ ప్రాజెక్ట్ అధికారులు 7 గేట్లను పది ఫీట్లు, రెండు గేట్లను ఏడు ఫీట్ల మేర త్తి మొత్తం తొమ్మిది గేట్ల ద్వారా 51990.66 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 4.11 టీఎంసీల నీరు చేరుకుంది. ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో వివిధ ప్రాంతాల నుండి పర్యాటకుల సందడి నెలకొన్నది. ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంత ప్రజలు, పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.