30-10-2025 05:37:13 PM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సదర్ మాట్ ఆనకట్ట సందర్శన, పాఠశాల తనిఖీ..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలను గురువారం మండల అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మొంథా తుఫాను ప్రభావం పరిస్థితిలను అంచనా వేయడానికి మండలంలోని మేడిపల్లి గ్రామపంచాయతీలో ఉన్న సదర్ మార్ట్ బ్యారేజీని పరిశీలించారు. అనంతరం సుర్జాపూర్, మేడమ్ పల్లి, బాదన కుర్తి, చింతలపేట, గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇల్లు పరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని మేస్త్రీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ తాసిల్దార్ సుజాతా రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీ ఓ రత్నాకర్ రావు, ఆయా గ్రామ పంచాయతీల సెక్రటరీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పలువురు ఉన్నారు.